Skip to main content

Namaste NRI

అభిమానంతో సుకుమార రూపం

దర్శకుడు సుకుమార్‌ మీద తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటారు యువ హీరో సువీక్షిత్‌. ప్రస్తుతం దూరదర్శని అనే చిత్రంలో నటిస్తున్న సువీక్షిత్‌కు సుకుమార్‌ అంటే ఎంతో ఇష్టం. ఇయన సినిమాలన్నీ చూస్తుంటాడు. సుకుమార్‌ మీద తనకున్న అభిమానాన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నంతో ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాలో తన స్వగ్రామమైన బోరెడ్డిగారిపల్లి గ్రామంలో రెండున్నర ఎరకాల భూమిలో 50 రోజులు శ్రమించి సుకుమార్‌ రూపం వచ్చేలా వరి పంటను సాగు చేశారు. పుష్ఫ ఘన విజయం తర్వాత సుకుమార్‌ రూపొందించబోతున్న పుష్ప 2 సినిమా పేరుతో వరి పంట పెంచారు. ఆయన పేరుతో ప్రత్యేక గీతాన్ని తయారు చేయించారు. తాజాగా ఈ ఫోటోలను, పాటను  సుకుమార్‌ను చూపించారు సువీక్షిత్‌. వాటిని చూసి ఆశ్చర్యపోయిన సుకుమార్‌ మాటలు రావడం లేదు, కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా అని స్పందిస్తూ సువీక్షిత్‌ను అభినందించారు. ప్రస్తుతం పుష్ప 2 ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు సుకుమార్‌.

Social Share Spread Message

Latest News