Skip to main content

Namaste NRI

 సుందరాంగుడు టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌

కృష్ణాసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సుందరాంగుడు. ఈ చిత్రాన్ని ఏవీ సుబ్బారావు సమర్పణలో ఎమ్మెస్కే ప్రమిద శ్రీ ఫిలింస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌, ఎమ్మెస్కే రాజు నిర్మించారు. వినయ్‌ బాబు దర్శకుడు.  ఈ నెల 17న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ సాంగ్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  హీరో కృష్ణసాయి ఎంతో ఇష్టంతో  ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు.  సినిమా రన్‌చూశా అని, చాలా క్వాలిటీగా తీశారన్నారు.  ఈ చిత్రం మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లు  తెలిపారు. ఈ  సందర్భంగా హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆరు పాటలు ఉంటాయి. హైదరాబాద్‌లో పాటు గోవాలో వీటి చిత్రీకరణ జరిపాం. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని మా కృష్ణసాయి ఇంటర్నేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు అందిస్తారు అన్నారు.   జీవా, జూనియర్‌ రేలంగి, మిర్చి మాధవి, బాషా, మెయిన్‌ విలన్‌ గా అమిత్‌ తివారి తదితరులు నటించారన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events