Skip to main content

Namaste NRI

పెద్దన్న గా వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అన్నాతై. ఈ సినిమాకు తెలుగులో పెద్దన్న అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి దర్పణంలా సాగే చిత్రమిది. రజనీకాంత్‌ శైలి యాక్షన్‌ అంశాలతో మెప్పిస్తుంది. శివ దర్శకుడు. నాయనతార కథానాయిక. ఈ చిత్రం డబ్బింగ్‌ హక్కులను ఏషియన్‌ ఇన్‌ఫ్రా ఎస్టేట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నారాయణ్‌దాస్‌ నారంగ్‌, సురేష్‌బాబు కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు.  మీనా, కుష్బూ, కీర్తి సురేష్‌, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇమ్మాన్‌ స్వరకర్త. తమిళ, తెలుగు భాషల్లో నవంబర్‌ 4న విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News