Skip to main content

Namaste NRI

ఇమ్రాన్‌ ఖాన్‌కు  సుప్రీం షాక్‌..ఏప్రిల్‌ 9న

పాకిస్థాన్‌ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని పాక్‌ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవిశ్వాస తీర్మానం తోసిపుచ్చడం సరికాదని స్పష్టం చేసింది. నేషనల్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది.

                విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానం పాక్‌ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు. విపక్షాల అవిశ్వాస తీర్మానం పాక్‌ రాజ్యాంగంలోని 95వ అధికరణం ప్రకారం నిబంధనల ఉల్లంఘనేనన్నారు. అవిశ్వాసం రాజ్యాంగ విరుద్ధం అంటూ డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చిన రూలింగ్‌ను విపక్షాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి.  అలాగే పాకిస్థాన్‌ దిగువ సభను రద్దు చేస్తూ పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ ఆల్వి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇమ్రాన్‌ అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్‌ 9న ఓటింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events