
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ డ్రామాగా దర్శకుడు సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ైస్టెలిష్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్ర బృందం పేర్కొంది. తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ పేర్కొంది. మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్‌రాజ్ తదితరులు ప్రధాన తారాగణం. సంతోష్ నారాయణ్ సంగీతాన్నందించారు.
