త్రిగుణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం స్వీటీ నాటీ క్రేజీ. ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది. రాజశేఖర్.జి దర్శకుడు. ఆర్.అరుణ్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత దామోదరప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. బెక్కెం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి అతిథులందరూ శుభాకాంక్షలు అందించారు. అందర్నీ నవ్వించేలా పూర్తి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఇనియ, రాధ, అలీ, రఘుబాబు, రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: సి.విజయశ్రీ.