Skip to main content

Namaste NRI

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌`2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ తలపడనుంది. గ్రూప్‌`2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి.  గ్రూప్‌`1లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లకు చోటు దక్కింది.  మరో నాలుగు జట్లు క్యాలిఫయింగ్‌ పోటీల ద్వారా మెయిన్‌డ్రాకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 23న దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ తొలిపోరు జరగనుంది. నవంబర్‌ 9న తొలి సెమీఫైనల్‌ కాగా, నవంబర్‌ 10న రెండో సెమీస్‌ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ జరగనుంది.

                        నిజానికి రెండేళ్ల  క్రితమే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా దీన్ని వాయిదా వేయక తప్పలేదు. ఇక ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన వరల్డ్‌ కప్‌ను ఈ ఏడాదికి  మార్చారు.  అంతకుముందు జరిగిన వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News