Skip to main content

Namaste NRI

తెలుగులో విడుదల కానున్న తమిళ్‌ సూపర్‌ హిట్‌ సినిమా

గత ఏడాది తమిళంలో విడుదలైన డా..డా చిత్రం మంచి విజయం సాధించింది. కవిన్‌, అపర్ణదాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత నీరజ కోన తెలుగులో పా..పా పేరుతో విడుదల చేయబోతున్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందించిన ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిందని, ఫీల్‌గుడ్‌ ఎమోషన్‌గా డ్రామా మెప్పించిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్‌ అయ్యే కథ ఇదని నిర్మాత నీరజ కోన తెలిపారు. భాగ్యరాజా, వీటీవీ గణేష్‌, ఐశ్వర్య, ప్రదీప్‌శక్తి తదిత రులు నటించారు. డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: జెన్‌ మార్టిన్‌, దర్శక త్వం: గణేష్‌ కె బాబు.

Social Share Spread Message

Latest News