Namaste NRI

అమెరికాలో ఘనంగా ప్రారంభమైన తానా సాంస్కృతిక పోటీలు.. ప్రతిభ ఉంటే ఛాంపియన్‌ మీరే!

అమెరికాలో తానా సాంస్కృతిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  ఉత్తర అమెరికాలో తెలుగు అసోసియే షన్‌ (తానా) ఆధ్వర్యంలో ఏటా తెలుగువారి కోసం, తెలుగువారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు , సంక్షేమ కార్యక్రమాలు ,నిర్వహిస్తోంది.  లుగువారి ఐక్యతను చాటేలా వివిధ కార్య క్రమాలు నిర్వహిస్తోంది. పండుగలు, వేడుకలే కాకుండా, తెలుగువారి సహాయార్థం శిక్షణ కార్యక్రమాలు నిర్వహి స్తోంది. జాగా కళాకారుల ప్రతిభ వెలికితీసేందుకు ఆగస్టు 3వ తేదీన అమెరికా ఇల్లినాయస్‌లోని ‘నేవర్‌ విల్లే’లో గల ‘ఎన్‌ఐయూ’ ఆడిటోరియంలో ఘనంగా ‘తానా కల్చరల్‌ కాంపిటీషన్‌ 2024’  నిర్వహించారు.

774d391b be9a 4915 b71f e386e8b92410

తానా సారథ్యంలో తానా కల్చరల్‌  సర్వీస్‌ కోఆర్డినేటర్‌  డాక్టర్‌ ఉమా కటికి(ఆరమండ్ల) పర్యవేక్షణలో మొట్ట మొదటిసారిగా ప్రారంభించిన  ఈ కల్చరల్‌ కాంపిటీషన్‌ ప్రారంభ కార్యక్రమానికి సుమారు 400 మందికి పైగా హాజరు కావడంతో ఆరంభం అదిరిపోయింది. చీఫ్‌ గెస్ట్‌ గా బోలింగ్‌బ్రోక్‌ మేయర్‌ మేరి అలెగ్జాండర్‌ బాస్టా (Bolingbrook Mayor  Mary Alexander Basta) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో పాల్గొన్న కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రణతి త్రిపుర యాంకర్‌గా వ్యవహరించారు. తన వాక్‌చాతుర్యంతో ఆద్యంతం అందరినీ అలరించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆడిటోరియం నిండిపోవడంతో చాలా మంది నిలబడి పోటీలను వీక్షించారు.

ఈ  చికాగో పోటీల్లో గెలిచిన అంతిమ విజేతలకు

1.వాయిస్‌ ఆఫ్‌ తానా –మిడ్‌వెస్ట్,

2. తానా అల్టిమేట్‌ ఛాంపియన్స్‌ – మిడ్‌వెస్ట్,

3. తానా డ్యాన్స్‌ జోడి –మిడ్‌వెస్ట్‌ ట్రోఫీలను అందజేశారు. 

 ఈ తానా కల్చరల్‌ కాంపిటీషన్‌ 2024 పోటీలు నవంబర్‌ 2వ తేదీ వరకు రీజియన్ల వారీగా నిర్వహిస్తామని డాక్టర్‌ ఉమా కటికి(ఆరమండ్ల)గారు తెలిపారు. నవంబర్‌ 2న ఫైనల్స్‌ రాలియేగ్ (  Raleigh) , నార్త్ కరోలినా (North Carolina) లో నిర్వహించి ఛాంపియన్లను ప్రకటిస్తామని వెల్లడించారు. వాలంటీర్లుగా వ్యవహరించిన గౌరీ శంకర్‌ అద్దంకి, రాధిక గరిమెళ్ల , శ్రీదేవి దొంతి, లక్ష్మి బెల్లంకొండ, శాంతి లక్కంసాని, స్వాతి బండి, అనీష్‌ బెల్లంకొండ, సుహాసిని రెబ్బా, సురేఖ నాదెళ్ల, గురుప్రీత్‌ సింగ్, వైష్ణవి, ఇందు, శిరీష చిగురుపాటి, జయశ్రీ లక్ష్మణన్, , శ్రీదేవి మల్లంపల్లి. సురేష్‌ ఇనపూడి, ప్రభాకర్ మల్లంపల్లి, వీరబ్రహ్మం ఆదిమూలంకి డాక్టర్‌ ఉమా కటికి(ఆరమండ్ల)గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

ca05dd57 885a 48f5 9352 9b7e52883208

-కేటగిరీల వారీగా పోటీలు..

తానా కల్చరల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో  ఈ కల్చరల్‌ కాంపిటీషన్‌ ఈవెంట్‌ను కేటగిరీల వారీగా.. తానా అన్నిరీజియన్స్ లోనూ  నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ ఉమా కటికి(ఆరమండ్ల) గారు తెలిపారు. సింగింగ్‌లో మూడు కేటగిరీలు, డాన్స్‌లో  కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సింగింగ్‌లో  క్లాసికల్, ఫిల్మ్, ఫోక్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. 0–9 ఏళ్లలోపు వారికి, 10–14 ఏళ్లు, 15–25 ఏళ్ల వారికి వేర్వేరుగా పోటీలు ఉంటాయని చెప్పారు. సింగింగ్, డ్యాన్స్‌లోనూ ఇవే ఏజ్‌ గ్రూప్‌ వారికి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. . ఫైనల్స్‌ నవంబర్‌ 2న  నార్త్‌ కరోలినాలో నిర్వహిస్తామని తెలిపారు.

Ixora 47

-తానా డ్యాన్స్‌ జోడీ కూడా..

ఇక 25 ఏళ్లు పైబడిన వారికి మాత్రం డ్యాన్స్‌లో జోడీ కాంపిటీషన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భార్య భర్తలు మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించారు. పాటల పోటీల్లో విజేతలకు వాయిస్‌ ఆఫ్‌ తానా అవార్డు, డ్యాన్స్‌లో తానా అల్టిమేట్‌ డాన్స్‌ ఛాంపియన్‌ అవార్డు ఇవ్వనున్నారు. జోడీ డ్యాన్స్‌లో తానా డ్యాన్స్‌ జోడీ అవార్డు ఇవ్వనున్నట్లు . డాక్టర్‌ ఉమా కటికి(ఆరమండ్ల)గారు తెలిపారు.

Mayfair 47
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events