Namaste NRI

ఆయిల్ పామ్ సాగుకు హారీ సబ్సిడీ ప్రకటించిన తెలంగాణ

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును చేసేలా రైతులను ప్రోత్సహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు భారీ స్థాయిలో ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఎకరాకు మొదటి సంత్సరం 26,000 రూపాయలు, రెండో సంవత్సరం 5,000 రూపాయాలను, మూడో సంవత్సరం 5,000 రూపాయలను పెట్టుబడిగా అందించాలని నిర్ణయించారు. ఈ పంటపై మరింత విస్తృతాధ్యయనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లోనూ అధ్యయనాలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. 500 ఎకరాలకు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 2024-25 నాటికి 10 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిని కూడా ప్రోత్సహించాలని, ప్రభుత్వమే భూమిని సేకరించి, జోన్లుగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. తద్వారా 25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, దీని ద్వారా దాదాపు 70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ కూడా ఇవ్వాలని కేబినెట్ అధికారులకు సూచించింది.

5 రోజుల్లోగా వివరాలు ఇవ్వండి…

విభాగాల వారీగా ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలనూ గుర్తించి, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొది. ఉద్యోగాల్లో చోటు చేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన అవసరమని, ఇందుకోసం కొత్త పోస్టులను కూడా సృష్టిచాలని ఆదేశించింది. అలాగే పౌర సరఫరాల శాఖతో పాటు వ్యవసాయ శాఖలో మాత్రం ఖాళీలు ఉండకూడదని ఆదేశించింది. అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేసుకోవాలని కేబినెట్ సూచించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events