Skip to main content

Namaste NRI

కొరియా సరిహద్దులో ఉద్రికత్త

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలోని ఉత్తర కొరియా రెచ్చిపోయింది. ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దులో క్షిపణుల మోత మోగింది. ముందు ఉత్తర కొరియా సముద్రపు సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన ఓ దీవి వైపు 20కి పైగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో దీవిలోని వారందరూ భూగర్బంలో నిర్మించుకున్న బంకర్లలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే స్పందించిన దక్షిణ కొరియా అదే ప్రాంతంలో సముద్రంపైకి క్షిపణులను పంపించింది. అమెరికా సైన్యంతో కలిసి దక్షిణ కొరియా చేపట్టిన సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ ఎరుగనంత భయంకరమైన మూల్యాలన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించిన కొద్ది గంటల్లో క్షిపణులతో దాడులకు తెగబడిరది. కొరియా ద్వీపకల్పం 1945లో విడిపోయిన తర్వాత ఓ క్షిపణి దక్షిణ కొరియా ప్రాదేశిక సముద్ర జలాల్లో పడటం ఇదే తొలిసారి. దీంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.

Social Share Spread Message

Latest News