మిడిల్ ఈస్ట్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు విమానాల రాకపోకలను లుఫ్తాన్సా రద్దు చేసింది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1న వైమానిక దాడి జరిగింది. ఇరాన్ టాప్ జనరల్, ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. కాగా, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ను తప్పక శిక్షించాలని అన్నారు. అయితే తమ దేశ రక్షణతోపాటు భద్రతకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అమెరికా నుంచి భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నారు.