
ఓదెల-2 చిత్రంలో ప్రతినాయకుడు తిరుపతి పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు కన్నడ నటుడు వశిష్ట ఎన్ సింహ. తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరించగా, అశోక్‌తేజ దర్శకత్వం. ఈ నేపథ్యంలో సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందన గురించి పాత్రికేయులతో వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ ఓదెల-2 సినిమాలో ఈవిల్ క్యారెక్టర్ కోసం స్పెషల్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశా. నా గొంతు బాగా ప్లస్ అయింది. సంపత్‌నంది ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడే చాలా సర్‌ప్రైజ్ అయ్యా అన్నారు. తిరుపతి పాత్ర సీన్‌లో ఉన్నా లేకపోయినా సినిమా మొత్తం అతని నామస్మరణతోనే నిండిపోయిందని, తిరుపతి ఓరకంగా సినిమాకు హీరోలా నిలిచాడని, ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని సింహ తెలిపారు. ఈ సినిమాలో తన పర్‌ఫార్మెన్స్ చూసి పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
