Namaste NRI

ఆ పండుగ స్పెషల్ గా రాబోతున్న… మజాకా

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మజాకా. రీతు వర్మ హీరోయిన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్ రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. మన్మథుడు ఫేమ్ అన్షు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. శివరాత్రి సందర్భంగా ఈనెల 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో సందీప్ కిషన్, రీతూవర్మ స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. ప్రసన్నకుమార్ కథ, సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events