Skip to main content

Namaste NRI

అది తమ లక్ష్యం కాదు.. కానీ

ఉక్రెయిన్‌ భూబాగాలను స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యం కాదని, ఒక దేశంగా ఉక్రెయిన్‌ను పూర్తిగా తెరమరుగు చేయాలన్నదే అసలు ఉద్దేశమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రి మెద్వేదేవ్‌ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి సహజ వాయువు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్‌ కోరుకోవడం, రెండేళ్లలో డబ్బు చెల్లించాలని భావిస్తుండడంపై మైద్వేదేవ్‌ స్పందించారు. రెండేళ్లలో ప్రపంచ పటంపై ఉక్రెయిన్‌ ఉంటుందని ఎవరు చెప్పగలరని ప్రశ్నించారు. అయితే జెలెన్‌స్కీ సలహాదారు మైఖైలో పోడోలాక్‌ దీనికి దీటుగా స్పందించారు. ఉక్రెయిన్‌ ఎప్పట్నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. కానీ అనుమానమంతా రెండేళ్ల తర్వాత మెద్వెదేవ్‌ ఎక్కడ ఉంటారన్నదే అంటూ ఆయన చురక అంటించారు.

Social Share Spread Message

Latest News