Skip to main content

Namaste NRI

అది రష్యాకు ఎప్పటికీ ముప్పే

ఫిన్లాండ్‌, స్వీడన్‌ సైతం నాటో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్టు ఫిన్లాండ్‌ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత స్వీడన్‌ సైతం ఫిన్లాండ్‌ బాటలోనే నడువనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల రష్యా అద్యక్ష కార్యాలయం తీవ్రంగా స్పందించింది. సైనిక, సాంకేతిక చర్యలతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తామని ఫిన్లాండ్‌ అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించారు. దీనికి కారణం మీరే (రష్యా). అద్దంలో చూసుకోండి అని ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సౌలి నినిస్టో ప్రకటన చేశారు. ఫిన్లాండ్‌ మాదిరే స్వీడన్‌ కూడా ఆలోచన చేస్తోంది. ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చూసిన తర్వాత నాటోలో చేరడమే మంచిదన్న అభిప్రాయం ఫిన్లాండ్‌, స్వీడన్‌ నేతలు, ప్రజల్లో బలపడుతోంది.  స్వీడన్‌, ఫిన్లాండ్‌ కు కూటమి స్వాగతం పలుకుతున్నట్టు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌ బర్గ్‌ ప్రకటన చేశారు.

Social Share Spread Message

Latest News