రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మంచి మిత్రుడు కాదని ట్విట్టర్ చీఫ్ ఎలన్‌మస్క్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఎలన్‌మస్క్ నిలిచారు. ప్రత్యేకించి తన స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఉక్రెయిన్ వాసులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు ఎలన్‌మస్క్. దీంతో ఆయనకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచినందుకే తనను పుతిన్ యుద్ధ నేరస్తుడని పిలిచారన్నారు. ఉక్రెయిన్‌కు సాయం చేసినందుకు పుతిన్, నన్ను యుద్ధ నేరస్థుడని పేర్కొన్నట్లు తెలిసింది. అందుకే ఆయన నాకు మంచి మిత్రుడు కాదు. అన్ని వార్తల్లోనూ కొంత దుష్ప్రచారం ఉంటుంది. దానిపై ప్రజలే నిర్ణయించుకోవాలి అని ఎలన్‌మస్క్ తెలిపారు.