Namaste NRI

ఆచార్య ట్రైలర్ వచ్చేసింది

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.  ఈ చిత్రంలో మరో పవర్‌ పుల్‌ పాత్రలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.  మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన  వచ్చింది. తాజాగా యూనిట్‌ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలై పవర్‌పుల్‌ డైలాగ్స్‌తో నిండి ఉంది. దివ్య వనం ఒకవైపు తీర్థ జనం ఒకవైపు.. నడుమ పాదఘట్టం అంటూ మొదలైన ట్రైలర్‌లో తండ్రీ తనయులు చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి చేసిన హంగామా ఆకట్టుకుంది. సంభాషణలు, యాక్షన్‌ ఘట్టాలతో ఆసక్తిని రేకెత్తించింది. మెగాస్టార్‌ చిరంజీవి,  రామ్‌చరణ్‌ల డైలాగులు ట్రైలర్‌లో ఆకట్టుకోగా సోనూసూద్‌ విలన్‌పాత్రలో కనిపించారు. ఇందులో మెగాస్టార్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌చరణ్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీతో కలిసి  మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తుంది. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీతం : మణిశర్మ. ఏప్రిల్‌ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events