Skip to main content

Namaste NRI

అసురగణ రుద్ర ప్రారంభం

నరేష్‌ అగస్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం అసుర గుణ రుద్ర. మురళి కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భగా నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు మా అన్న. మా సంస్థలో రూపొందిస్తున్న తొలి చిత్రమిది. టైటిల్‌ రోల్‌ని పోషించే నటుడి పేరు గురించి మా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా పోటీ నిర్వహిస్తున్నాం. గెలుపొందిన వాళ్లకి బహుమానం అందజేస్తాం. ఇదే కలయికలోనే త్వరలోనే రెండో చిత్రాన్ని ఆరంభిస్తాం అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ మెడికల్‌ నేరాల నేపథ్యంలో ఓ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో అభినయ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఈ నెల 6 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణని ప్రారంభించి, మే 1కి తొలి షెడ్యూల్‌ని పూర్తి చేస్తాం అని అన్నారు.  నిర్మాత సి.కల్యాణ్‌ అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మురళీ శర్మ, ఆమని, శత్రు, అమిత్‌, అభినయ, దేవీప్రసాద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అమరనాథ్‌ బొమ్మిరెడ్డి, సంగీతం: శేఖర్‌ చంద్ర. కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళీ వంశీ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events