Namaste NRI

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌`2000 సెక్షన్‌ 66ఎ కింద నమోదైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ 66ఎ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

          ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదు కాగా.. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events