Skip to main content

Namaste NRI

కన్యాకుమారి తో వస్తోన్న దర్శకుడు దామోదర

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా పుష్పక విమానం. దర్శకుడు దామోదర మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వస్తున్నాడు. దామోదర స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కన్యాకుమారి. హీరోయిన్ గా గీతా శైనీ, శ్రీ చరణ్ రాచకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ఇది. ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.  ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలామందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను ఇస్తోంది. మొదటి చిత్రాన్ని తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో చూపించిన దామోదర ఈ కథను శ్రీకాకుళం నేపథ్యంలో గ్రామీణ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రానికి ఎడిటర్: నరేష్ అడుపా, సంగీతం: సాహిత్య సాగర్, సినిమాటోగ్రఫీ : శివ గాజుల, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహ నిర్మాతలు : సతీష్ రెడ్డి, వరీనియా మామిడి, సిద్ధార్థ్ ఏ, నిర్మాత, మాటలు, దర్శకత్వం : దామోదర.

Social Share Spread Message

Latest News