
ఇంద్రా రామ్ హీరోగా నటించిన చిత్రం చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం. ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు నిర్మాత. ఈ సందర్భంగా హీరో ఇంద్రా రామ్ పాత్రికేయులతో ముచ్చటించారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశానని, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్‌లలో ప్రవేశం ఉందని అన్నారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ తీసుకొని అక్కడి నుంచి టన్నెల్ తవ్వి బ్యాంక్‌లో దోపీడి చేసిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ కథను తయారుచేశారని తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమా కోసం ఫిక్షనల్ విలేజ్‌ను క్రియేట్ చేశారని చెప్పారు. ఆర్‌ఎక్స్ 100 సినిమాలో తాను హీరోగా నటించాల్సిందని, అనుకోని కారణాల వల్ల అది మిస్ అయ్యిందని, ఈ చిత్రంలో కార్తికేయ అద్భుతంగా నటించారని అన్నారు. ఈ నెల 25న విడుదలకానుంది.
