Skip to main content

Namaste NRI

శుభవార్త చెప్పిన జుకర్‌ బర్గ్‌

మెటా సీఈవో,  ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌  శుభవార్త చెప్పారు. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు.  హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్కిల్లా చాన్ మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ఆగస్ట్ జన్మించింది. ఇప్పుడు మరో చిన్నారికి జుకర్ బర్గ్ దంపతులు జన్మనివ్వబోతున్నారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్‌. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో మా జీవితాల్లోకి రాబోతున్నారు అంటూ పోస్టు చేశారు.  భార్య ప్రిస్కిలా చాన్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సైతం పంచుకున్నారు.

Social Share Spread Message

Latest News