Namaste NRI

అమెరికా ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌కు లైన్ క్లియ‌ర్

అమెరికా ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌ కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. సేనేట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో పీట్ 51 ఓట్ల తేడాతో గ‌ట్టెక్కారు. పీట్ హెగ్‌సేత్ అభ్య‌ర్థిత్వాన్ని డెమోక్రాట్ల‌తో పాటు కొంద‌రు రిప‌బ్లిక‌న్లు వ్య‌తిరేకించారు. అయితే అధ్య‌క్షుడు ట్రంప్ స‌మ‌ర్థించిన పీట్ చివ‌ర‌కు ర‌క్ష‌ణ మంత్రి అయ్యారు. పీట్‌కు వ్య‌తిరేకంగా 50 ఓట్లు, అనుకూలంగా 50 ఓట్లు ప‌డ్డాయి. టై-బ్రేక‌ర్ కావ‌డంతో,  ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ త‌న కీల‌క‌మైన ఓటును పీట్‌కు అనుకూలంగా వేశారు. దీంతో 51 ఓట్ల తేడాతో పీట్ హెగ్‌సేత్ గెలిచారు. అమెరికా ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్‌సేత్ క‌న్ఫ‌ర్మేష‌న్ పూర్తి అయ్యింది.

పీట్ హెగ్‌సేత్ గ‌తంలో అమెరికా ర‌క్ష‌ణ‌ద‌ళంలో ప‌నిచేశారు. ఫాక్స్ న్యూస్ యాంక‌ర్‌గా కూడా ఆయ‌న చేశారు. అయితే ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై విచార‌ణ కూడా జ‌రిగింది. ర‌క్ష‌ణ మంత్రిగా ఆమోదం పొందేందుకు, సేనేట్ విచార‌ణ చేప‌ట్టింది. త‌న‌పై ఉన్న అన్ని ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. సేనేట్‌లోని 47 మంది డెమోక్ర‌టిక్ నేత‌లు పీట్ హెగ్‌సేత్‌కు వ్య‌తిరేకంగా ఓటేశారు. ఆయ‌న్న ఓడించాలంఏట మ‌రో న‌లుగురు రిప‌బ్లిక‌న్లు అవ‌స‌రం వ‌చ్చింది. అయితే ముగ్గ‌రు మాజీ సీనియ‌ర్ రిప‌బ్లిక‌న్ నేత‌లు పీట్‌కు వ్య‌తిరేకంగా ఓటేశారు. కానీ టై కావ‌డంతో, ఉపాధ్య‌క్షుడు వాన్స్ త‌న ఓటును పీట్‌కు ఫేవ‌ర్‌గా వేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events