Skip to main content

Namaste NRI

అతి బిగ్గరగా త్రేన్చింది.. గిన్నిస్‌ రికార్డు పట్టేసింది

ఆహారం ఆరగించిన తరువాత వచ్చే త్రేన్పుల శబ్దంతో ఓ మహిళ గిన్నిస్‌ రికార్డు సాధించింది. అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన కింబర్లీ కిమీకోలా వింటర్‌ 107.3 డెసిబెల్స్‌ శబ్దంతో త్రేన్పు రప్పించి అతి బిగ్గరైన త్రేన్పు రికార్డును సొంతం చేసుకుంది. కిచెన్‌లో వినియోగించే బ్లెండర్‌ 70 నుంచి 80 డెసిబెల్స్‌ శబ్ధం చేస్తుంది. హ్యాండిల్‌ డ్రిల్‌ మెషీన్‌ (90`95), కొన్ని ద్విచక్ర వాహనాలు (100`110) డెసిబెల్స్‌ శబ్దాలు చేస్తాయి. కిమీకోలా  త్రేను వాటిని మించిపోయింది. త్రేన్పు బిగ్గరగా రావడానికి కిమీకోలా బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి, కాఫీ , బీర్‌ తాగింది. ఏ ఆహారం తీసుకుని ఏయే పానీయాలు తాగితే త్రేన్ను పెద్దగా వస్తుందో తెలుసుకోవడానికి ఆమె ఆరు వారాలపాటు సాధన చేసింది. స్పైసీ ఫుడ్స్‌, సోడా, ఆల్కహాల్‌తో ఉపయోగం ఉంటుందని తెలుసుకుంది. అంతకు ముందు ఈ రికార్డు ఇటలీకి చెందిన ఎలిసా కాగ్నోని పేరిట ఉండేది. ఆమె 107 డెసిబెల్స్‌ శబ్దంతో త్రేన్ను రప్పించింది.

Social Share Spread Message

Latest News