Skip to main content

Namaste NRI

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సావ్3 మూవీ

సామ్రాట్‌, డీమోన్‌ పవన్‌, రాను బొంబాయ్‌కి రాను సాంగ్‌ ఫేం లిఖిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సావ్3 కృష్ణమాయ దర్శకుడు. వి.విజయ నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత అశోక్‌కుమార్‌ అతిథిగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ టైటిల్‌ పెట్టేందుకు ఓ కారణం ఉంది. సా అంటే సావిత్రి.వ్ అంటే విజయ్‌కుమార్‌. 3 అంటే త్రివిక్రమ్‌ రాజు. ఇందులో ప్రధాన పాత్రల పేర్లివి. కొత్తవాైళ్లెన అంతా అద్భుతంగా నటించారు. సాంకేతిక నిపుణులంతా మంచి ఔట్‌పుట్‌ ఇచ్చారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని దర్శకుడు కృష్ణమాయ తెలిపారు. ఇంకా ప్రధాన పాత్రధారులంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News