Skip to main content

Namaste NRI

ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలి.. ఫ్రాన్స్ వార్నింగ్

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నారు. ఆ దేశ వార్షిక వ్యవసాయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సంక్షోభం చాలా రోజులు ఉంటుందని, ఈ యుద్ధం చాన్నాళ్లు కొనసాగుతుందన్నారు. దానితో వచ్చే సంక్షోభ పర్యవసాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. యూరోప్‌లో మళ్లీ యుద్ధం మొదలైందని అన్నారు. పుతిన్‌ ఆ యుద్ధాన్ని కాంక్షించారని, మానవ విషాదాన్ని ఆయన క్రియేట్‌ చేస్తున్నారని అన్నారు. ఉక్రెయిన్‌ ప్రజల పక్షాన యూరోప్‌ దేశాలు అండగా ఉన్నట్లు తెలిపారు. నాటోలో కీలక దేశమైన ఫ్రాన్స్‌ ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నట్లు కూడా వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News