Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇకలేరు

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ (118) కన్నుమూశారు. సిస్టర్ ఆండ్రీగా గుర్తింపు పొందిన ఆమె ఫ్రాన్స్లోని టౌలాన్ ఉన్న తన నర్సింగ్ హోమ్లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆండ్రీ ప్రతినిధి డేవిడ్ తవెల్లా వెల్లడించారు. లూసిల్ రాండన్ 1904, ఫిబ్రవరి 11న జన్మించారు. ఆమె అసలుపేరు లూసిల్ రాండన్. 1944లో సిస్టర్ ఆండ్రీగా మారిన ఆమె 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి బయటపడ్డారు. కొవిడ్-19 నుంచి బయటపడిన అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు. రెండు ప్రపంచ యుద్ధాలను కళ్లారా చూసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయురాలిగా, గవర్నస్గా పనిచేశారు. విచీ, ఆవెర్గ్నే-రోన్-ఆల్ఫ్స్లోని దవాఖానలో 28 ఏళ్లపాటు అనాథలు, వృద్ధులకు సేవలు అందించారు. ఇప్పటి వరకు నమోదైన ఫ్రెంచ్, యూరోపియన్ వృద్ధులలో ఆండ్రీ మూడో వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. మరో నెల రోజుల్లో 119వ పుట్టినరోజు జరుపుకోనుండగా ఆమె మరణించడం గమనార్హం.

Social Share Spread Message

Latest News