Skip to main content

Namaste NRI

అధీర ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

కల్యాణ్‌ దాసరిని హీరోగా అధీర పేరుతో కొత్త చిత్రం తెరకెక్కిస్తున్నారు. భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్‌ వర్మ, మార్వెల్‌, డీసీ వంటి సూపర్‌ హీరోలను క్రియేట్‌ చేస్తున్నాడు. కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇది సూపర్‌ హీరో చిత్రం. గ్రాండ్‌గా డిజైన్‌ చేసిన అధీర  ఫస్ట్‌లుక్, పోస్టర్ ను ఆర్‌ఆర్‌ఆర్‌ త్రయం అయిన రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సంయుక్తగా విడుదల చేసి టీమ్‌కు తమ బెస్ట్‌ విషెస్‌ తెలియజేసారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దారరధి శివేంద్రా కెమెరా మెన్‌గా వ్యవహరిస్తున్నారు. విజులవ్స్‌ బిజి.ఎం. పర్ఫెక్ట్‌ సింక్లో వున్న సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హను`మాన్‌ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. అధీర సినిమా వివరాలు తెలియజేస్తామని ప్రశాంత్‌ వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత.   ఈ చిత్రానికి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. నిర్మాత డి.దానయ్య కుమారుడే కళ్యాణ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events