Skip to main content

Namaste NRI

భరతవర్ష సినిమా నుంచి అమ్మ కదిలి వచ్చె సాంగ్ రిలీజ్

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం భరతవర్ష. సంకల్ప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీ.శ. 642 నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి అమ్మ కదిలి వచ్చే అనే పాట విడుదలైంది. ఈ పాటకు అనుదీప్‌దేవ్‌ సంగీతాన్నందించారు. కల్యాణ్‌చక్రవర్తి త్రిపురనేని ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు.

దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఇందులో శూలాంభ అమ్మవారి ఉత్సవ ఊరేగింపును చూపించారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి… వంటి అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ పాటలో వేడుకగా చూపించడం ప్రధానాకర్షణగా నిలిచింది. నాయకానాయికలు గోపీచంద్‌, రీతూవర్మ ఈ పాటలో అద్భుతంగా కనిపించారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌దేవ్‌, దర్శకత్వం: సంకల్ప్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events