అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో దెబ్బతిన్న దేశాన్ని మళ్లీ నిలబెట్టడంలో భాగంగా తయారు చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. 1.2 ట్రిలియన్ డాలర్ల ఈ బిల్లును సెనేట్ సభ్యులు 69`30 ఓట్ల తేడాతో గెలిపించారు. ఈ బిల్లుకు మిచ్ మెకానెల్ సహా పలువురు రిపబ్లికన్ అభ్యర్థులు కూడా మద్దతిచ్చారు. ఇలా రెండు పార్టీలూ కలిసి ఒక బిల్లుకు ఆమోదం తెలపడం అరుదే. ఈ నిర్ణయం అమెరికాకు చాలా మేలు చేస్తుందని సెనేట్‌లో మెజారీటీ పక్షనేత చక్ షూమర్ అన్నారు. ఈ బిల్లుపై ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా మాట్లాడుతూ సాధ్యమైనంత తర్వగా సెనేట్ ఈ బిల్లును తన టేబుల్ మీదకు పంపాలని చెప్పారు.