Namaste NRI

అగ్రరాజ్యంలో అగ్ర స్థానం భారతీయులదే

అమెరికాలో భారతీయులు ధనవంతులుగా అవతరించారని అక్కడి తాజా జనాభా గణాంకాల్లో వెల్లడైంది. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న ఒక్కో  భారతీయ కుటుంబం సగటున ఏడాదికి రూ.92 లక్షలు (1.23 లక్షల డాలర్లు) సంపాదిస్తున్నది. అమెరికా మొత్తంగా చూస్తే ఒక కుటుంబ సగటు ఆదాయం రూ.47 లక్షలు (64 వేల డాలర్లు) మాత్రమే.  అమెరికాలో ఉన్న భారతీయ ఇండియన్లలో 79 శాతం మంది గ్రాడ్యుయేట్లు కాగా దేశ సగటు 34 శాతం మాత్రమే. అమెరికాలో ఉన్న డాక్టర్లలో 9 శాతం మంది భారత సంతతికి చెందినవారే.

ప్రస్తుతం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 16 లక్షల మంది వీసాదారులున్నారు. 14 లక్షల మంది గ్రీన్‌కార్డు సంపాదించి శాశ్వత స్థిరనివాస హోదా పొందారు.  గడిచిన మూడు దశాబ్దాల్లో అమెరికాలో ఆసియన్ల జనాభా మూడు రెట్లు పెరిగింది. యూఎస్‌లో వేగంగా పెరుగుతున్న నాలుగు జాతుల్లో ఆసియన్లు ఒకరని తెలుస్తోంది. మధ్యతరగతి కుటుంబాల ఆర్జనలో అక్కడి ఇతర ఆసియా దేశాల వారితో పోల్చినా భారతీయుల వార్షిక ఆర్జన అధికంగానే ఉంది. తైవాన్‌ దేశస్తులు దాదాపు రూ.72 లక్షలు (97.129 డాలర్లు), ఫిలిప్పీన్‌ దేశస్తులు రూ.70.40 లక్షలు (95.000 డాలర్లు) సంపాదిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]