Skip to main content

Namaste NRI

భారత్‌ ఏం కావాలన్నా… సరఫరా చేసేందుకు తాము సిద్ధం

రష్యా నుంచి భారత్‌ ఏం కొనాలనుకున్నా వాటిటి సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోస్‌ అన్నారు. భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగంలో భారత్‌కు పరస్పర సహకారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. భారత్‌, రష్యా మధ్య దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉందన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ఎక్కువ మక్కువ చూపుతుదని అన్నారు. ఉక్రెయిన్‌పై తాము చేస్తున్నది యుద్ధం ఎంత మాత్రమూ కాదని, అదో స్పెషల్‌ ఆపరేషన్‌ అని అన్నారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ తాము దాడులు చేశామని అన్నారు. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని, రష్యా విధానం కూడా అదేనని అన్నారు. అందుకే ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉన్నాయని అన్నారు.

Social Share Spread Message

Latest News