Namaste NRI

ఈ దుర్ఘటనకు వారే కారణం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లుడుతూ గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ అనుసరించిన పాలసీ విధానాలను తప్పుబట్టారు. వారివల్లే విమాన ప్రమాదం జరిగిందని విమర్శలు గుప్పించారు.
ఆకాశ భద్రతా ప్రమాణాల విషయంలో ఒబామా, బైడెన్ రాజీపడ్డారని ఆరోపించారు. మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో నియంమించిందని ఆరోపించారు. తాను మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఒబామా, బైడెన్, ఇతర డెమొక్రాట్లు తమ విధానాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. వారు కొందరికే ప్రాధాన్యత ఇచ్చారని, తాము మాత్రం సమర్ధులైన వారినే కాలాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్ఏఏకు తాత్కాలిక కమిషనర్ను నియమిస్తున్నట్లు చెప్పారు. గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events