Namaste NRI

తాము ఎప్పటికీ లొంగిపోయేది లేదు …. ధీటుగా ఎదురుదాడి

 రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ ధీటుగా ఎదురుదాడి చేస్తున్నదని ఆ దేశాధ్యక్షుడు వోల్డోమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి జెలెన్‌స్కీ మాట్లాడారు. తాము ఎప్పటికీ లొంగిపోయేది లేదన్నారు. అమెరికా తమకు అందించిన సాయం ఛారిటీ కాదు అని, దాన్ని భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు.  ఉక్రెయిన్‌కు అండగా నిలవనున్నట్లు  బైడెన్‌ స్పష్టం చేశారు. ఆ దేశానికి కొత్తగా రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించనున్నట్లు ఆయన వెల్లడిరచారు. అంతర్జాతీయ దేశాలను సమీకృతం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రష్యా దాడితో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే 50 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా అందించింది. అయితే ఉక్రెయిన్‌కు బ్లాంక్‌ చెక్‌ ఇవ్వబోమని బైడెన్‌ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆ దేశ రిపబ్లికన్లు చెబుతున్నారు. బైడెన్‌తో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌  సైనిక పురస్కారంతో బైడెన్‌ను జెలెన్‌స్కీ సత్కరించారు.  రష్యా దురాక్రమణ మొదలయ్యాక జెలెన్‌స్కీ ఇలా విదేశీ పర్యటన రావడం ఇదే తొలిసారి.

Social Share Spread Message

Latest News