Skip to main content

Namaste NRI

కుటుంబ ప్రాధాన్యతను తెలియజెప్పే సినిమా ఇది

రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సః కుటుంబానాం. డా.రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, సత్య, రాజశ్రీ నాయర్‌, రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేశ్‌, భద్రం తదితరులు కీలక పాత్రధారులు. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహదేవ్‌గౌడ్‌, నాగరత్న నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా ట్రైలర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇలాంటి కథ తన 48ఏండ్ల సినీ కెరీర్‌లోనే వినలేదని, ఇందులో తాను పోషించిన పాత్రలో చాలా ఛాలెంజ్‌లు ఉన్నాయని, కుటుంబ ప్రాధాన్యతను తెలియజెప్పే సినిమా ఇదని డా.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఇందులో చిత్రమైన పాత్రను చేశానని, హీరోహీరోయిన్ల కాంబినేషన్‌ సీన్లలో నటించడం ముచ్చటేసిందని బ్రహ్మానందం చెప్పారు. దిగ్గజాలు పనిచేసిన సినిమా ఇదని దర్శకుడు ఉదయ్‌శర్మ పేర్కొన్నారు. తనను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా నిర్మాత మహాదేవ్‌గౌడ్‌, హీరో రామ్‌కిరణ్‌ కూడా మాట్లాడారు. అగ్రసంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. డిసెంబర్‌ 12న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు కెమెరా: మధు దాసరి, నిర్మాణం: హెచ్‌.ఎన్‌.జి. సినిమాస్‌, ఎల్‌ఎల్‌పి.

Social Share Spread Message

Latest News