Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై… అమెరికా స్పందన ఇదే

2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది.  ఈ సందర్భంగా  విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని అన్నారు. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం శక్తివంతమైందని, ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై తమ దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాలను గురించే తాము ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అమెరికా, భారత్ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events