Namaste NRI

అదృష్టం అంటే ఇదీ.. లాటరీలో

 అమెరికాలోని మైనేకి ప్రాంతానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి ఇటీవల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. జనవరి 13వ తేదీ న జరిగిన  మెగా మిలియన్స్ జాక్పాట్ డ్రా లో గెలిచిన టికెట్ నంబర్తో అతని నంబర్లు సరిపోలాయి. దీంతో నిర్వాహకులు సదరు వ్యక్తిని జాక్పాట్ విజేతగా ప్రకటించారు. ఈ లాటరీలో అతనికి ఏకంగా రూ. 10,973 కోట్లు వరించాయి. లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని నిర్వాహకులు 29 సంవత్సరాల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. విజేతకు మొత్తం ఒకేసారి కావాలన్నా ఇస్తారు. అయితే, రూ.7వేల కోట్లు మాత్రమే చెల్లిస్తారు. చాలా మంది విడతల వారీగా కాకుండా ఒకేసారి తీసుకుంటుంటారు.  సాధారణంగా విదేశాల్లో ఏదైనా నెలలో 13వ తేదీ శుక్రవారం దురదృష్టకరమైన రోజుగా పరిగణిస్తారు. అయితే, ఆ దురదృష్టకరమైన రోజే ఆ వ్యక్తికి అదృష్టం వరించడం మరో విశేషం.

Social Share Spread Message

Latest News