Skip to main content

Namaste NRI

ప్రేమిస్తే ఇంతే మూవీ ప్రారంభం

నటుడు, బ్రహ్మాజీ తనయుడు, ఓ పిట్ట కథ సినిమా ఫేమ్‌ సంజయ్‌ రావు హీరోగా, అనితా షిండే (తొలి పరిచయం) హీరోయిన్‌గా ప్రేమిస్తే ఇంతే పేరుతో ఓ కొత్త చిత్రం మొదలైంది. జె దర్శకత్వంలో వెంకట రత్నం నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో పాటు హిలేరియన్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆలీ, ఆర్‌.జె. హేమంత్‌, ఆర్‌.జె.కృష్ణ వెంకట కిరణ్‌, వైవా రాఘవ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు జై మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నేపథ్యంలో హై ఫై లవర్‌ స్టోరీ బ్రాక్‌డ్రాప్‌తో ప్రేమిస్తే ఇంతే చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. హీరో సంజయ్‌ రావు లవర్‌ బాయ్‌గా కనిపిస్తాడు అని తెలిపారు. నిర్మాత వెంకటరత్నం మాట్లాడుతూ దర్శకుడు జై చెప్పిన కథ చాలా బాగుంది. నేటి జనరేషన్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది అని అన్నారు.  ముహూర్తపు సన్నివేశానికి సీఏ సిద్దార్థ్‌ క్లాప్‌ కొట్టి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భాను ప్రసాద్‌ జె. ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌ సబ్బి.

Social Share Spread Message

Latest News