Namaste NRI

ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్‌ ఫిల్మ్‌ ఇదే

సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించి చిత్రం మంజుమ్మల్‌ బాయ్స్‌. చిదంబరం ఎస్‌.పొదువల్‌ దర్శకుడు. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర యూనిట్‌తో పాటు నిర్మాతలు వివేక్‌ కూచిభొట్ల, శశిధర్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి అతిథులుగా హాజరై సినిమా తెలుగులో కూడా అఖండ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ మధ్య కాలంలో తాను చూసిన బెస్ట్‌ ఫిల్మ్‌ ఇదే నని, తెలుగులో కూడా పెద్ద విజయం సాధించడం పక్కా అని నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని నమ్మకం వ్యక్తం చేశారు. తమకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ దర్శకుడు చిదంబరం కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం  ఈ నెల 6న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events