Namaste NRI

అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా  తెలుగు మహిళ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. మేరీలాండ్‌ గవర్నర్‌ పదవి కోసం డెమోక్రటిక్‌ నాయకుడు వెస్‌ మూర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్థానానికి అరుణా మిల్లర్‌ పోటీ చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు. గవర్నర్‌ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. ఒకవేళ గవర్నర్‌ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారు.  మేరీలాండ్‌లో అరుణకు ప్రజాదరణ ఎక్కువ. రిపబ్లికన్‌ మద్దతుదారులు  కూడా అమెకు అనుకూలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. 58 ఏళ్ల అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నపుడు 1972లో ఆమె కుటుంబం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడిరది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events