సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా సుభాష్‌చంద్ర దర్శకత్వంలో అభినవ్‌రావు నిర్మించిన చిత్రం గోదారి గట్టుపైన. ఈ నెల 8న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో సుమంత్‌ప్రభాస్ మాట్లాడారు. మా గోదారి గట్టుపైన ఆడుతున్న థియేటర్లన్నీ ఫ్యామిలీలతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్‌ని పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా దర్శకుడు సుభాష్‌చంద్రకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

పదిరోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ వసూలు చేయడం గొప్ప విషయమని, గోదారి గట్టుపైన సినిమా తమ టీమ్‌కి మైలురాయివంటిదని దర్శకుడు తెలిపారు. ఇంకా నిర్మాత అభినవ్‌రావు, కథానాయిక నిధి ప్రదీప్, నటీనటులు దేవిప్రసాద్, రేణు, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ కూడా మాట్లాడారు.





























