Namaste NRI

తెలంగాణలో అమెజాన్ ప్రకటించిన మూడు కార్యక్రమాలు, PAFI సదస్సులో వెల్లడి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా అమెజాన్ ఇండియా సంస్థ మూడు ప్రధాన కార్యక్రమాలను ప్రకటించింది. రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, వివిధ వర్గాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది.

న్యూఢిల్లీలో పీఏఎఫ్ఐ (PAFI) వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పలు ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులను అన్వేషించడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్యకలాపాలను విస్తరించాలని వారికి సూచించారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) శ్రీ చేతన్ కృష్ణ తో సమావేశం నిర్వహించారు. అమెరికా వెలుపల అమెజాన్‌కు అతిపెద్ద గ్లోబల్ కేంద్రాలలో తెలంగాణ ఒకటిగా ఉందని గుర్తు చేస్తూ, రాష్ట్రంతో తన నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పింది.

అమెజాన్ ప్రకటించిన మూడు కార్యక్రమాలు:

SME ఎగుమతిదారులకు మద్దతు: గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలంగాణలోని చిన్న, మధ్య తరహా వ్యాపార విక్రేతలను ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ఎగుమతులు పెరుగుదల, వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది.

మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత: అమెజాన్ సంస్థ కళాకార్ (Kalakar) కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించడానికి అవకాశాలు కల్పిస్తుంది. ఇది మహిళా సాధికారతకు, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది.

గిగ్ వర్కర్ల సంక్షేమం: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో 100 విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో అన్ని ప్లాట్‌ఫామ్‌ల గిగ్ వర్కర్లకు పార్కింగ్, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు, ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events