Skip to main content

Namaste NRI

దానిని అంతం చేయడం అనేది.. అభూత కల్పనే

అమెరికాలో కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా రోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధిని తట్టుకని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందని ఆ దేశ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌)లో ఫౌచీ ప్రసంగించారు. కొవిడ్‌ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌ ఉన్న వ్యాప్తి వేగం కారణంగా అతి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్లు, వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనా వైరస్‌ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడిరచారు.

                వ్యాక్సిన్లు తీసుకున్న వారు వైరస్‌ కారణంగా తలెత్తే తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకుంటారు. కానీ వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోందని అన్నారు. ఒమిక్రాన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఆరోగ్య సమస్యలున్నవారు వైరస్‌ బారిన పడినా తేలిగ్గా చికిత్స చేయడానికి సరిపడా మెడిసిన్స్‌ ఉన్న స్థితికి దేశం చేరుతోందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events