Skip to main content

Namaste NRI

కీవ్ పై కన్నేసిన రష్యాకు… తీవ్ర ప్రతిఘటన

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై కన్నేసిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. రాజధాని సరిహద్దుల్లోకి ప్రవేశించిన రష్యా దళాలకు స్థానిక ఆర్మీ ముచ్చమటలు పట్టిస్తోంది. రష్యా భీకర దాడులు చేస్తున్నా తమ ఆర్మీ ధీటుగా బదులు ఇస్తోందని ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది. సిటీలోని ఓ ప్రధాన వీది వద్ద రష్యా బలగాలను తమ ఆర్మీ యూనిట్ వెనక్కి వెళ్లేలా చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. వీధుల్లో భీకర స్థాయిలో పోరాటం జరుగుతోందని, ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని కీవ్ నగర ప్రభుత్వం ఇదేశాలు జారీ చేసింది. వాసిల్కీవ్ ప్రాంతంలో హోరాహోరీ పోరు సాగుతున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. పలు రష్యా టార్గెట్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ దళాలు పేర్కొన్నాయి.

Social Share Spread Message

Latest News