Skip to main content

Namaste NRI

శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టుగెదర్ రీలోడెడ్ సంగీత విభావరి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టుగెదర్ రీలోడెడ్ సంగీత విభావరి అలరించింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, స్థానిక యువ సంగీత కళాకారులు తమ ప్రదర్శనతో మైమరిపించారు. ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు యు. శ్రీనివాస్‌ను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక సంగీత నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రిస్కో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన అత్యాధునిక విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

డ్రమ్మర్ పద్మశ్రీ శివమణి, మాండలిన్ రాజేష్, స్వామినాథన్ సెల్వగణేష్, ప్రవీణ్ నారాయణ్, బాలు రాజేంద్ర కురుప్, ముద్దు పాయ్, ప్రియ వసంత్ తదితర ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఫ్రిస్కో పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 25 మంది యువ సంగీత కళాకారులు భాగస్వామ్యులు అయ్యారు. కర్ణాటక, హిందుస్థానీ, ప్రపంచ సంగీతం, ఫ్యూజన్ సంగీతం, ప్రజాదరణ పొందిన సినీ సంగీతం వంటి విభిన్న సంగీత ప్రక్రియల సమ్మేళనంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సంగీత కార్యక్రమానికి 800 మందికి పైగా సంగీతాభిమానులు హాజరయ్యారు.

డా. ప్రసాద్ తోటకూరకు కమ్యూనిటీ ఇమ్పాక్టర్ అవార్డును ప్రదానం చేశారు. గత మూడు దశాబ్దాలగా డా. ప్రసాద్ తోటకూర సమాజానికి చేస్తున్న విశిష్ట సేవలకు, మానవతా దృక్పథంతో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు, భారతీయ సంగీత, సాహిత్య, నృత్య కళల ప్రోత్సాహకునిగా, అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని కమిటీ వ్యవస్థాపకుడిగా గుర్తిస్తూ శుభం ఫౌండేషన్ ప్రత్యేకంగా సత్కరించింది. డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేస్తూ లలిత కళలు, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో శుభం ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ మాట్లాడుతూ సమాజం నుంచి పొందిన ప్రయోజనాలను తిరిగి సమాజానికి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజసేవలో ముందుండి నాయకత్వం వహిస్తున్న శుభం ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు గోపాల్ పోణంగిని అభినందించారు.

డా. ప్రసాద్ తోటకూర గత మూడు దశాబ్దాలుగా సమాజానికి చేస్తున్న విశిష్ట సేవలు, మానవతా కార్యక్రమాలు మరియు భారతీయ సంగీత, సాహిత్య, నృత్య కళల ప్రోత్సాహానికి ఆయన అందించిన నాయకత్వాన్ని గుర్తిస్తూ నిర్వాహకులు సత్కరించారు. డా. మైక్ వాల్డ్రిప్ (ఫ్రిస్కో ఐఎస్డీ మాజీ సూపరింటెండెంట్): విద్యారంగానికి అందించిన సేవలు మరియు దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. కళలను ప్రోత్సహించడం, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడం, ఫ్రిస్కో ఐఎస్డీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం వంటి సేవా కార్యక్రమాల గురించి గోపాల్ పోణంగి వివరించారు. వ్యాఖ్యాత అనీషా పోణంగి తన వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రావు కల్వల, డాక్టర్ ప్రకాశరావు వెలగపూడి, ఆత్మచరణ్ రెడ్డి, సతీష్ మండువ, మహేంద్రరావు, శ్రీలత సూరి, రాధిక కొడెల, ఫ్రిస్కో ఐఎస్డీ ట్రస్టీలు సురేష్ మండువ, రెనీ శాంపిల్, షెర్రీ సలాస్, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సభ్యులు ఆన్ ఆండర్సన్, లారా రమ్మెల్, శుభం ఫౌండేషన్ డైరెక్టర్లు, ప్రధాన కార్యనిర్వాహక బృంద సభ్యులు మధుమతి వైశ్యరాజు, రవి భట్టిప్రోలు, రాజా వైశ్యరాజు, విజయశ్రీ పోణంగి, మహేష్ చొప్పా, కార్యక్రమ డైరెక్టర్ విజి అయ్యంగార్, శ్రీకుమార్ గోమఠం, జ్యోత్స్న కొండపులి, మనోజ్ఞ ఆలమూరు, బ్రాడ్ షార్ప్, సుదర్శన్ అయ్యంగార్, రాకేష్ చెరాల, శిరీష గోమఠం, ఆనంద్ చెల్లప్ప, కోషి శామ్యూల్, సతీష్ కంది, భాస్కర్ ఆలూరు, మాలిని రత్నం, నాగరాజు నలజుల, గణేష్ నలజుల తదితరులు పాల్గొని సహకరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events