Skip to main content

Namaste NRI

నేషనల్‌ అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్

కేంద్ర ప్రభుత్వం మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ ను ప్రకటించిన విషయం తెలిసిందే. 2021 ఏడాదికిగాను చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి. ఒక్క టాలీవుడ్ నుంచే తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా వచ్చిన అవార్డులు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరోసారి గ్లోబల్‌ ఇండస్ట్రీకి చాటిచెబుతున్నాయి. ఇప్పటికే ఆస్కార్‌ విన్నర్‌గా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు తాజా నేషనల్‌ అవార్డుల్లో వివిధ విభాగాల్లో 6 పురస్కారాలు దక్కాయి.  పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికై తిరుగులేని ట్రెండ్‌ సెట్‌ చేశాడు. ఇదే సినిమాకు ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్‌ నిలిచాడు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ‌(కొండపొలం), ఉత్తమ సినిమాగా ఉప్పెన ఒక్కో అవార్డు అందుకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌కు విభాగాల వారిగా.. బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌: కింగ్ సోలోమన్‌, బెస్ట్‌ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్‌, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : ఎంఎం కీరవాణి, ప్లేబ్యాక్ సింగర్‌ : కాలభైరవ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ : ఆర్ఆర్‌ఆర్‌, బెస్ట్ పాపులర్ సినిమా : ఆర్‌ఆర్‌ఆర్‌.

Social Share Spread Message

Latest News