Skip to main content

Namaste NRI

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు మోషన్ లోగోను విడుదల చేసిన యఫ్.డి.సి. ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం

ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. చంద్రాస్ చంద్ర, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ జెల్ల దర్శకుడు. ఈ చిత్ర లోగోను ఎఫ్‌డీసీ  ఛైర్మన్ అనిల్ కుర్మాచలం విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మణ్ జెల్ల మాట్లాడుతూ  ప్రేమలో విడిపోతుంటారు కానీ స్నేహంలో బ్రేకప్స్ తక్కువ. మన జీవితంలో స్నేహానికి విలువ ఇవ్వాలని చెప్పే చిత్రమిది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో  పాటు ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం  అన్నారు.

హీరో ఇంద్ర మాట్లాడుతూ  ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. మంచి కథతో వస్తున్న ఈ స్టోరీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎమోషన్ క్యారీ చేస్తుంది.సినిమా చాలా బాగా వచ్చింది. చూసిన వారందరికీ ఈ సినిమా నచ్చుతుంది. హీరో ఇమ్రాన్ మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ మీద తీసిన ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు చిత్రం ప్రతి ఒక్కరి మనషులను గెలిచే చిత్రంగా నిలుస్తుంది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు. హీరోయిన్ కోమల్ నాయర్ మాట్లాడుతూ ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఫ్రెండ్షిప్ మీద తీసినటువంటి ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events