కెనడా , మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుంచి 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. అలా చేస్తే అమెరికా లోని వినియోగదారులే అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జనవరి 20, ఫిబ్రవరి 1, ప్రేమికుల రోజు బహుమతిగా లేదా ఏప్రిల్ 1 ఇలా ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకు వెళ్లినా తగినట్టు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయన నిర్ణయం అమలు చేస్తే అమెరికా వినియోగదారులే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఈ చర్యలను మేము కోరుకోవడం లేదు. ట్రంపే కావాలనుకుంటున్నారు. ఆర్థిక వృద్ధిని పెంచుతానంటూ ఆయన పేర్కొన్న నేపథ్యంలో మాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. కానీ ఆయన అందుకు విరుద్ధంగా వెళ్తున్నారు అని ట్రూడో అన్నారు.