కెనడా 51వ రాష్ట్రంగా మారాలని తాను తీవ్రంగా కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇటీవల సూచించినట్లుగా, కెనడాను విలీనం చేసుకోవడం గురించి మీరు మాట్టాడటం నిజమైనదేనా అని అడిగినప్పుడు ట్రంప్ అవును అది నిజమే అన్నారు. కెనడాకు మనం సంవత్సరానికి 200 బిలియన్ల డాలర్లు కోల్పోతున్నాము కాబట్టి అది 51వ రాష్ట్రంగా మారడం మంచిదని నేను భావిస్తున్నాను. మనం కెనడాకు సబ్సిడీగా సంవత్సరానికి 200 బిలియన్ల డాలర్లను చెల్లిస్తున్నాము. దానిని నేను కొనసాగనివ్వను అని ట్రంప్ వివరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)